Janhvi Kapoor Nani33: నానితో జాన్వీ..మరో తెలుగు సినిమాలో ఛాన్స్!..ఆ డైరెక్టర్కి మరో హిట్ పక్కా!!

Janhvi Kapoor Nani33: నానితో జాన్వీ..మరో తెలుగు సినిమాలో ఛాన్స్!..ఆ డైరెక్టర్కి మరో హిట్ పక్కా!!

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor )..వరుస సినిమాల్లో నటిస్తోంది. ఓ వైపు బాలీవుడ్ లోను మరోవైపు టాలీవుడ్ లోను వరుస అవకాశాలతో కక్రేజీ హీరోయిన్ గా మారింది. నిజం చెప్పాలంటే, ప్రస్తుతం జాన్వీకి తెలుగులోన ఎఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమాలో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది రిలీజ్ కాక ముందే చెర్రీ..బుచ్చి RC 16 సినిమాలో త్వరలో అడుగు పెట్టబోతోంది.

ALSO READ | RAAYAN Trailer: రాయన్ ట్రైలర్ గూస్బంప్స్..ధనుష్ ఫ్యాన్స్ ఇక మీ అంచనాలే!..ఊహించేసుకోండి

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ మరో స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. నేచురల్ స్టార్ నాని (Nani)  హీరోగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న మూవీలో జాన్వీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని టాక్. ప్రస్తుతం కాల్షీట్లు సర్దుబాటు గురించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ నానికి 33వ సినిమా కావడం విశేషం.

ALSO READ | జాన్వీకపూర్ ఉలాజ్‌‌‌‌ .. మూవీ నుంచి ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల

నానితో దసరా లాంటి రా అండ్ రస్టిక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టాడు. ఇక అదే ఊపులో దసరా సినిమా తర్వాత మళ్లీ నానితోనే శ్రీకాంత్ రెడీ అయ్యాడు.ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇప్పటికే రిలీజ్ చేయగా..స్టైలిష్ లుక్, కోరా మీసాలతో నాని కళ్లద్దాలు పెట్టుకుని, ఊర మాస్ లెవల్లో బీడీ తాగుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. 

'నాయకుడిగా ఉండటానికి మీకు గుర్తింపు అవసరం లేదు..అనే ట్యాగ్ తో సినిమా ఏ విధంగా ఉండనుందో అనే అంచనాలు షురూ చేశారు శ్రీకాంత్. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ రానుంది. ప్రస్తుతం నాని నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ ఆగష్టు 29న రిలీజ్ కాబోతుంది.