బాలీవుడ్ స్టార్ నటి కృతి సనన్(Kriti sanon) ఎమోషనల్ అయ్యారు. తనకు ఎదురైనా చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ఆమె అభిమానులు కృతికి ఏమైంది? ఎందుకు ఇలా ఎమోషనల్ పోస్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కృతి సనన్ ఇటీవల మిమీ చిత్రానికి గాను జాతీయ అవార్డు(National award) అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్ లో నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మోడలింగ్‌లో చేస్తున్న సమయంలో ఒకరోజు హైహీల్స్ వేసుకొని గడ్డిలో నడవాల్సి వచ్చింది. అక్కడ నెల సరిగ్గా లేకపోవడంతో నడవలేకపోయాను. దీంతో కొరియోగ్రాఫర్ నాతో దురుసుగా ప్రవర్తించారు. నాకు చాలా బాధేసింది. కన్నీళ్లు ఆగలేదు ఏడ్చేశాను. ఆ రోజులు ఇంకా నా కళ్ళముందే ఉన్నాయి. ఇలాంటి సంఘటనతో నాలో ధృడ సంకల్పం పెరిగింది. అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించాను. విజయం సాధించాను. నన్ను విమర్శించినవారికి నా విజయాలతోనే బుద్ధి చెప్పాలనుకున్నాను. ఒకప్పుడు నన్ను విమర్శించిన వారే ఇప్పుడు పొగుడుతున్నారు. నా దృష్టిలో నిజమైన విజయం అది అంటూ చెప్పుకొచ్చింది కృతి.