
మాజీ మిస్ వరల్డ్, మిస్ ఇండియా మానుషీ చిల్లర్(Manushi Chillar) అందాల ఆరబోతకు రెడీ అంటోంది. ఇప్పుడిప్పుడే నటిగా బిజీ అవుతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో 'సామ్రాట్ పృధ్వీరాజ్' లో కనిపించింది. ఆ తర్వాత 'గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' లోనూ యాక్ట్ చేసింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలంటైన్' తో పాటు..మరో రెండు మూడు సినిమాలు చేస్తోంది. మార్చిలో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో యూనిట్ సినిమా ప్రమోషన్ పై దృష్టి పెట్టింది. కెరీర్పై చిల్లర్ చేసిన కామెంట్ల్ ఆసక్తికరంగా మారాయి.
'ప్రస్తుతం అనేది కేవలం ఏడాది మాత్రమే ఉంటుందేమో. ఆ తర్వాత కెరీర్ ని నిర్దేశించాల్సింది నటన మాత్రమే. మిస్ ఇండియా -మిస్ వరల్డ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు అనేవి కేవలం ఎంట్రీ వరకే. ఆపరేషన్ వాలెంటైన్ ఫలితం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఐశ్వర్యరాయ్ - సుస్మితా సేన్ పోషించిన గ్లామర్ పాత్రలు నేను పోషించడానికి నేను రెడీ అని అంది. ప్రస్తుతం మానుషి చిల్లర్ బాలీవుడ్ లో 'బడేమియాన్ చోటేమియా' చిత్రంలోనూ నటిస్తోంది.