వార్ 2లో ఎన్టీఆర్ హీరోయిన్గా శార్వరి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ?

వార్ 2లో ఎన్టీఆర్ హీరోయిన్గా శార్వరి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ?

ఆర్ఆర్ఆర్(RRR) తరువాత ఎన్టీఆర్(Ntr) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. గ్లోబల్ వైడ్ గా ఆయన ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందుకే ఆయన తరువాత సినిమాలపై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే తన తరువాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్. ఇందులో భాగంగానే రెండు భారీ ప్రాజెక్టు లను ఒకే చేశారు ఈ హీరో. 

అందులో ఒకటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర కాగా.. రెండవది బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ చేస్తున్న వార్ 2 మూవీ. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందులో ఎన్టీఆర్ కు వార్2 మూవీ చాలా స్పెషల్. అందుకే ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఫికస్ గా ఉన్నారు. ఎన్టీఆర్ చేస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో.. ఇందులో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు? లుక్ ఎలా ఉండబోతోంది? ఎన్టీఆర్ కుక్ హీరోయిన్ గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు? అనేవి తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూసైనా  క్షణాల్లో ట్రెండ్ చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sharvari ? (@sharvari)

ఇందులో భాగంగానే తాజాగా వార్2 సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఆ బ్యూటీ మరెవరో కాదు శార్వరి. ఈ అమ్మడు ఇంతకుముందు మోడలింగ్ తోపాటు పలు బాలీవుడ్ సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో నటించిన ఈ బ్యూటీ.. బంటి ఔర్ బబ్లీ 2 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. మరో రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు వార్ 2 మూవీలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట మేకర్స్. ఇక వెచ్చే ఏడాది వార్2 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :- ప్లాప్ హీరో.. కొత్త దర్శకుడు.. రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమా?