South Indian Directors: ఇండియన్ సినిమా పవర్ అంటే ఇది..బిగ్ సక్సెస్ ఇస్తోంది మనోళ్ళే..

South Indian Directors: ఇండియన్ సినిమా పవర్ అంటే ఇది..బిగ్ సక్సెస్ ఇస్తోంది మనోళ్ళే..

ఇండియన్ సినిమా అంటే..మన దగ్గర రకరకాల ‘వుడ్లు’ అనేవి ఉన్నమాట వాస్తవమే. అయితే, ఇక్కడ సౌత్ నుంచి నార్త్ భాషల వరకు డిఫరెంట్ పేర్లతో వాటిని పిలుస్తున్నాం. కానీ, ఇప్పుడు ఇండియన్ సినిమాకు కూడా ఓ పేరు పెట్టే టైమ్ వచ్చేసినట్టే. నిజానికి ఒకప్పుడు ఇండియన్ సినిమాలలో బాలీవుడ్ దే హవా కొనసాగేది. ఎందుకంటే, భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ..దక్షిణాది సినిమా పరిశ్రమను చాలా చిన్నచూపు కూడా చూస్తుండే వారు అక్కడి మేకర్స్. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి పూర్తిగా మారింది. 

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి,ఆర్.ఆర్.ఆర్, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్,సుకుమార్ పుష్ప లాంటి రీజనల్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు వచ్చి బాలీవుడ్ ను షేక్ చేశాయి.జాతీయ స్థాయిలో ఈ సినిమాలు పెద్ద సక్సెస్ కావడంతో బాలీవుడ్ అనేది మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. వేరే దేశాలవాళ్లు ఈ పాన్ ఇండియా సినిమాలు చూసి..ఇవి బాలీవుడ్ సినిమాలే అని నమ్ముతున్నారు.కానీ అసలు విషయం తెలుసుకున్నాక, బాలీవుడ్ అనేది ఇండియన్ ఇండస్ట్రీలో భాగమేనని గుర్తిస్తున్నారు.ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ,మాలీవుడ్, సాండల్ వుడ్ లాగే బాలీవుడ్ అనేది ఒక భాగమేనని అందరూ అర్థం చేసుకుంటున్నారు. 

ప్రస్తుతం సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ అయితే బాలీవుడ్ బడా స్టార్స్ కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తున్నారు. అలాగే, మనవాళ్ళు కూడా   బాలీవుడ్ స్టార్స్ ని ఎప్పటికప్పుడు బీట్ చేస్తూ కలెక్షన్స్ ల సునామీని క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ నటించిన ‘‘జవాన్’’ హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యి కెరియర్ లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు..ఓ పదేళ్ల కింద డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో గజినీ తీసి ఇండస్ట్రీకి పిచ్చెక్కించేశాడు. 

అలాగే బాలీవుడ్ కండల వీరుడు..ప్రస్తుతం అట్లీతో ఓ మూవీ చేయడానికి డిసైడ్ అయిపోయాడు. ఇదివరకు చూసుకుంటే ప్రముఖ డ్యాన్స్ ఐకాన్ ప్రభుదేవాతో వాంటెడ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.అంతేకాదు, డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తో  సికిందర్ అనే సినిమాని  కూడా ప్లాన్ చేశాడు. ప్రస్తుతం తమిళ్ బిల్లా మూవీ డైరెక్టర్ విష్ణువర్ధన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. 

Also Read:లైలా మ్యాజికల్ ఐస్ చూశారా..విశ్వక్ లేడీ మేకోవర్ చూస్తే కుర్రాళ్లు పడాల్సిందే!

ఇక గతేడాది అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..అర్జున్ రెడ్డిని కోలీవుడ్, బాలీవుడ్ (షాహిద్ కపూర్) లో రీమేక్  చేసి ఏకంగా తన సిగ్నేచర్ జెండాని పాతేసాడు. రీసెంట్ గా యానిమల్ మూవీతో రణబీర్ కపూర్ కి కెరీర్ లో అతి పెద్ద సక్సెస్ ఇచ్చాడు. సినిమా అంటే ఇలా కూడా తీయొచ్చా? అనే ఆలోచనను ప్రతి ఇండస్ట్రీ డైరెక్టర్ కి తెలిసేలా చేశాడు. దీంతో బాలీవుడ్ బడా బ్యానర్ అయిన టి-సిరీస్ లో మరో రెండు ప్రాజెక్ట్స్ కోసం సందీప్ రెడ్డి వంగాతో అగ్రిమెంట్ చేసుకుంది. ఇలాంటి వైబ్ క్రియేట్ చేసింది మన తెలుగువాడే కావడం విశేషం.  

ఇక ప్రస్తుతం తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన కల్కి2898ఏడీతో డైరెక్టర్ నాగ్ అశ్విన్..బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాలో అమితాబ్ చేసిన నటనకు కుదాస్ అని చెప్పుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే కల్కిలో హీరో అని చెప్పొచ్చు..అంతలా తన క్యారెక్టర్ తో ఇంపాక్ట్ చూపాడు. అలాగే తెలుగులో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ తో ఓ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ చేస్తున్నాడు. 

ఇపుడు కాదు..ఈ  తరం స్టార్ డైరెక్టర్స్ కంటే ముందుగానే విలక్షణమైన డైరెక్టర్ ఆర్జీవీ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు  కూడా అప్పట్లో అమితాబ్ లాంటి స్టార్ హీరోలతో చేసి కెరీర్ హిట్స్ ఇచ్చారు. ఇదీ పంథా అప్పటినుండి ఇప్పటివరకు ఇనసాగుతూ వస్తుంది. ఇక ఫ్యూచర్ లో కూడా తెలుగు డైరెక్టర్స్..సినిమా విభాగంలో పనిచేసే ప్రతి టెక్నీషియన్ సత్తా బాలీవుడ్ నుంచి మొదలు హాలీవుడ్ వరకు వినిపించే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. ఇది కదా ఇండియన్ సినిమా పవర్.