ఓయో వెంటపడ్డ బాలీవుడ్ సెలబ్రెటీలు

న్యూఢిల్లీ: ఐపీఓకి రావాలని ప్లాన్  చేస్తున్న ఓయోలో బాలీవుడ్ నటులు  మాధురి దీక్షిత్‌‌, అమృత రావ్‌‌, ప్రొడ్యూషర్‌‌‌‌  గౌరి ఖాన్‌‌ తాజాగా ఇన్వెస్ట్ చేశారు. కిందటేడాది ఆగస్టులో  గౌరి ఖాన్‌‌ 24 లక్షల షేర్లను సిరీస్ జీ ఫండింగ్ రౌండ్‌‌లో కొన్నారు.  మాధురి దీక్షిత్‌‌, ఆమె భర్త శ్రీరామ్‌‌ నెనే, ఫ్లెక్స్‌‌ స్పేస్‌‌ ఫౌండర్‌‌‌‌ రితేష్ మాలిక్‌‌తో కలిసి 20 లక్షల ఓయో షేర్లను కొనుగోలు చేశారు. 

అమృత రావ్‌‌, ఆమె భర్త అన్మోల్‌‌ సూద్‌‌తో  కలిసి సెకెండరీ మార్కెట్‌‌లో కొన్ని షేర్లను దక్కించుకున్నారు. బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు నువేమా వెల్త్‌‌  ఓయోలో రూ.100 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. ఒక్కో షేరుని రూ.53కి  కొనుగోలు చేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ రేటు దగ్గర ఓయో వాల్యుయేషన్ 4.6 బిలియన్ డాలర్లు పలుకుతోంది. కానీ, ఒకానొక దశలో ఈ కంపెనీ వాల్యుయేషన్ 10 బిలియన్ డాలర్ల వరకు వెళ్లింది.