
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ఇటీవల నటుడిగా బిజీ అవుతున్నాడు. ‘మహారాజా’ చిత్రంతో విలన్‌గా కోలీవుడ్‌లో సూపర్ హిట్ అందుకున్న అనురాగ్.. ఇటీవల ‘రైఫిల్ క్లబ్’ అనే చిత్రంతో మలయాళంలోనూ మెప్పించాడు. ఇప్పుడిక తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. అడివి శేష్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటిస్తూ తన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘దీక్షలో ఉన్న పోలీస్ నన్ను పట్టుకుంటాడు అట.. నన్ను పట్టుకోవాలంటే ఆ దేవుడే దిగి రావాలేమో’ అంటూ శేష్ సోషల్ మీడియా ద్వారా అనురాగ్ కశ్యప్ పాత్రను పరిచయం చేశాడు.
నిజాయితీ, ధైర్యం కలగలిసిన ఫియర్ లెస్ ఇన్‌స్పెక్టర్‌గా తన క్యారెక్టర్ ఉండబోతోంది. షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు, సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా ఆ తర్వాత మహారాష్ట్రలో షెడ్యూల్ కొనసాగుతుంది.