బాలీవుడ్ ప్రముఖ మాజీ నటి సోమీ అలీ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా తానూ బాలీవుడ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పలు ఎన్జీవో సంస్థలతో కలసి మంచి పనులు చేసినప్పటికీ నన్ను సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసిగానే గుర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ తో రిలేషన్ షిప్ తనకి పెద్ద శాపంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
సల్మాన్ కి అభద్రతా భావం ఎక్కువగా ఉంటుందని దాంతో తన నుంచి విడిపోయిన తర్వాత తన బంధువులు, స్నేహితులను తనతో మాట్లాడవద్దని చెప్పేవాడని సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక సల్మాన్ ఖాన్ 60 ఏళ్ళ వయసులో కూడా చిన్న పిల్లాడి మనస్తత్వంతో ఉంటాడని అలాగే రౌడీలా ప్రవర్తిస్తుంటాడని దీంతో తన పక్కన ఉన్నవారిని ఇబ్బందుల్లో పడేస్తుంటాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read : పుష్ప 2 పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య నటి సోమీ అలీ ఎక్కువగా సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇటీవలే సల్మాన్ తో రిలేషన్ లో ఉన్నపుడు ఓ అండర్ వరల్డ్ డామన్ నుంచి తనకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపింది. దీంతో ఈ విషయం గురించి సల్మాన్ తో చెప్పడంతో వెంటనే వారితో మాట్లాడి అంతా నార్మల్ చేశాడని వెల్లడించింది.