ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్ గాయమైంది. మంగళవారం ముంబైలోని అతని ఇంట్లో ప్రమాదవశాత్తు లైసెన్స్‌డ్ రివాల్వర్ మిస్‌ఫైర్ అయి.. కాలులోకి బులెట్ దూసుకుపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే గోవిందాను దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు ఆపరేషన్‌చేసి బులెట్‌ను తొలగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.
మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో గోవిందా కోల్‌కతాకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను అల్మారాలో ఉంచుతుండగా ప్రమాదవశాత్తు అతని చేతిలో నుంచి జారిపడి మిస్‌ఫైర్‌అయింది. ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడని.. 2, -3 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.