
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక రోషన్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. ఈమధ్య స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేక ఫ్లాప్ ఎదుర్కుంటున్నాడు కానీ ఒకప్పుడు మాత్రం క్రిష్, ధూమ్, బ్యాంగ్ బ్యాంగ్ తదితర యాక్షన్ సినిమాలతో బాగానే ఆకట్టుకున్నాడు. అయితే హృతిక రోషన్ ఎక్కువగా తన సినిమాలోని యాక్షన్ సీన్స్ ని డూప్ లేకుండానే సొంతంగానే చేస్తుంటాడు. ఈ క్రమంలో రెగ్యులర్ గా జిమ్ వర్కౌట్లు చేస్తూ ఫిట్ గా ఉంటాడు.
అయితే ప్రస్తుతం హీరో హృతిక రోషన్ కి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే హృతిక రోషన్ తనలాగే పోలి ఉన్న వ్యక్తితో కలసి రెస్టారెంట్ నుంచి బయటికి వస్తూ కనిపించాడు. అంతేకాదు... హృతిక్ తో పాటూ ఉన్న వ్యక్తి కూడా అచ్చం హృతిక రోషన్ లాగే డ్రెస్సింగ్ స్టయిల్, హెయిర్ స్టైల్, ముఖ కవళికలు ఇలా చూడటానికి హృతిక్ లాగే ఉన్నాడు. దీంతో ఆ వ్యక్తి హృతిక రోషన్ బాడీ డబుల్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమాల్లో హీరోలు కొన్ని యాక్షన్ సీన్స్ చేసేప్పుడు తనని పోలిన వ్యక్తులని డూప్ గా పెట్టుకుని చేస్తుంటారు. ఆ తర్వాత ఎడిటింగ్ సమయంలో మేనేజ్ చేస్తుంటారు. కానీ హృతిక రోషన్ ఇలా పబ్లిక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.
Also Read :- తెలుగు యాంకర్ తో డైరెక్టర్ రాజమౌళి లవ్ ట్రాక్
ఈ విషయం ఇలా ఉండగా హృతిక రోషన్ ఇటీవలే ఫైటర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో వార్ 2 అనే సినిమాతో అలరించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తోపాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ సినీ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. దాదాపుగా రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
హృతిక్ రోషన్ బాడీ డబుల్ ను చూసాక
— devipriya (@sairaaj44) February 19, 2025
..
తెలుగు హీరోలు అందరి బాడీ డబుల్స్
ఎలా వుంటారో చూడాలని వుంది
..
జస్ట్ క్యూరియాసిటీ pic.twitter.com/w452OTFUfO