అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరం: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్

అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరం: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ స్పందించారు. తన బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్‎లో భాగంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘‘అల్లు అర్జున్ అరెస్ట్ కావడం దురదృష్టకరం. -సేఫ్టీ ప్రోటోకాల్‌ విషయంలో యాక్టర్ ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరు.. ఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదు’’ అని అన్నారు. 

అల్లు అర్జున్ అరెస్ట్‎పై ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. బాలీవుడ్ నుంచి మాత్రం బన్నీ అరెస్ట్‎పై ఫస్ట్ రియాక్ట్ అయ్యింది వరుణ్ ధావన్ మాత్రమే. మిగిలిన యాక్టర్స్ స్పందిస్తారో లేదా చూడాలి. అల్లు అర్జున్ లేటేస్ట్ చిత్రం పుష్ప 2 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుపిస్తోన్న విషయం తెలిసిందే. డబ్బింగ్ చిత్రంగా విడుదలైన పుష్ప 2 బాలీవుడ్ సినిమాల రికార్డులను కూడా బద్దలు కొడుతోంది. 

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కి సలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే. 2024, డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్‎లోని తన నివాసం వద్ద అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బన్నీని ఆయన నివాసం నుండి నేరుగా చిక్కడపల్లి పీఎస్‎కు తరలించారు. పోలీస్ స్టేషన్‎లో దాదాపు రెండు గంటల పాటు బన్నీని విచారించి అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. 

ALSO READ | అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన తెలుగు హీరోయిన్.. అలాంటి వాడంటూ కామెంట్స్..

విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో వైద్యపరీక్షలు ముగిసిన తర్వాత పోలీసులు అల్లు అర్జున్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అర్జున్‎ను చెంచల్ గూడ జైలుకు తరలిస్తుండటంతో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పెద్ద సంఖ్యలో బలగాలను చెంచల్ గూడ  పరిసరాల్లో మోహరించారు. జైలు పరిసరాల్లోకి ఇతరులను అనుమతించడం లేదు. జైలు వద్దకు పెద్ద ఎత్తున బన్నీ అభిమానులు చేరుకునే అవకాశం ఉండటంతో  జైలు వద్ద  రోజువారీగా ఉండే భద్రత, పోలీసు సిబ్బంది కంటే.. అదనంగా భద్రత బలగాలు మోహరించి సెక్యూరిటీని ఫుల్ టైట్ చేశారు పోలీసులు.