హీరో కాకుంటే.. హీరోయిన్ కంటే తక్కువగా చూస్తారు : వివేక్ ఒబెరాయ్ అనుభవాలు

హీరో కాకుంటే.. హీరోయిన్ కంటే తక్కువగా చూస్తారు : వివేక్ ఒబెరాయ్ అనుభవాలు

టాలీవుడ్ ప్రముఖ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర సినిమాతో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమే. అయితే వివేక్ ఒబెరాయ్ హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా మెప్పించాడు. మొదట్లో ఆర్జీవీ దర్శకత్వం వహించిన కంపెనీ అనే సినిమాతో కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు ప్యాన్ ఇండియా భాషల్లో ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవలే వివేక్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ఆరంభంలో ఎదుర్కున్న స్ట్రగుల్స్ గురించి ఆడియన్స్ తో పంచుకున్నాడు.

కంపెనీ సినిమాలో నటించిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు షాద్ అలీ డైరెక్ట్ చేసిన "సాథియా" అనే సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ చాలా తక్కువ.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే సమయంలో తనకి కనీసం కారవ్యాన్ కూడా ఇవ్వలేదని దీంతో బట్టలు మార్చుకోవడానికి హోటల్స్, రెస్టారెంట్స్ బాత్ రూమ్స్ ఉపయోగించేవాడినని తెలిపాడు. 

Also Read :- విడుదలై పార్ట్ 2 రివ్యూ

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాణీ ముఖర్జీకి మాత్రం మేకప్ వ్యాన్ తోపాటు ఇతర సౌకర్యాలు ఇచ్చారని కానీ తాను మాత్రం షూటింగ్ సెట్స్ లో టేబుల్స్ మీద న్యూస్ పేపర్స్ పరుచుకుని పడుకునేవాడినని వెల్లడించాడు. ఇక షూటింగ్ సమయంలో ట్రైపాడ్స్ ని భుజాన మోసుకుంటూ సెట్స్ లొకేషన్ కి వెళ్ళేవాడినని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరి లైఫ్ లో స్ట్రగుల్ ఫేజ్ ఉంటుందని ఆది దాటుకుని ముందుకెళితే కచ్చితంగా మంచి లైఫ్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

ఈ విషయం ఇలా ఉండగా ఒకప్పుడు ఆఫర్లు, ఆర్ధిక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కున్న వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు ఆర్థికంగా బాగానే సెటిల్ అయ్యాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. ప్రస్తుతం వివేక్ ఒబెరాయ్ ఆస్తుల విలువ దాదాపుగా రూ.1200 కోట్లు పైచిలుకు ఉన్నట్లు సమాచారం.