
గ్లామర్ రోల్స్‌తోనే కాదు నటనకు ప్రాధాన్యత గల పాత్రలతోనూ మెప్పించగలనని నిరూపిస్తోంది అనన్య పాండే. అక్షయ్ కుమార్ హీరోగా ఇటీవల వచ్చిన ‘కేసరి 2’చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషించింది.
ఇందులో తన నటన చూసిన వాళ్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో తన నటనను విమర్శించిన వాళ్లు కూడా ఇప్పుడు తన పెర్ఫెర్మెన్స్‌కు ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే క్రేజీ ప్రాజెక్ట్‌లో అనన్య నటించబోతోందని సమాచారం. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ హ్యూజ్ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటించాల్సి ఉండగా ఇప్పటికే జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్‌లను ఎంపిక చేశారని, మరో హీరోయిన్‌గా అనన్యపాండే నటించనుందనే ప్రచారం జరుగుతోంది.
Sun Pictures 🤝 @alluarjun 🤝 @Atlee_dir
— Sun Pictures (@sunpictures) April 8, 2025
Crossing Borders. Building Worlds. 💥🔥#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥
🔗 - https://t.co/NROyA23k7g#AA22 #A6 #SunPictures pic.twitter.com/2Cr3FGJ9eM
గతంలో విజయ్ దేవరకొండకు జంటగా ‘లైగర్’లో నటించగా, ఆ సినిమా పరాజయం పాలవడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు మరో టాలీవుడ్ స్టార్‌తో నటించే అవకాశం వచ్చింది.
ఇటీవల బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో మెప్పిస్తున్న అనన్య.. ఈ సినిమాతో సౌత్‌లోనూ సత్తా చాటే అవకాశం ఉంది. మరి అనన్య ఎంపిక కేవలం ప్రచారమేనా లేక హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేస్తారో చూడాలి!