Janhvi Kapoor: హీరోయిన్ జాన్వీకపూర్‌కు ఫుడ్‌ పాయిజనింగ్‌..ఆసుపత్రిలో చికిత్స..

Janhvi Kapoor: హీరోయిన్ జాన్వీకపూర్‌కు ఫుడ్‌ పాయిజనింగ్‌..ఆసుపత్రిలో చికిత్స..

శ్రీదేవి కూతురు సినీ నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) ఆస్పత్రి పాలయ్యారు. తాజాగా ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు బాలీవుడ్ సినీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

జాన్వీ  హుటాహుటిన ఆసుపత్రిలో చేరడంతో ఆమె అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో వెంటనే జాన్వీ తండ్రి బోనికపూర్ మీడియాతో మాట్లాడుతూ.."ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, మరో 1-2 రోజుల్లో కోలుకునే అవకాశం ఉందని..ఆ తర్వాత జాన్వీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయబడుతుందని చెప్పారు. ఇక జాన్వీకపూర్‌ హెల్త్ అప్డేట్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే జాన్వీకి..బుధవారం నాడు చాలా బలహీనంగా ఉండటంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ తన అపాయింట్‌మెంట్‌లన్నింటినీ వారానికి వాయిదా వేసింది. ఇక గురువారం కూడా మరింత అనారోగ్యం బారిన పడటంతో కుటుంబసభ్యులు ఆమెకు సరైన వైద్య సహాయం అందించాలని నిర్ణయించుకుని ఆసుపత్రిలో చేర్పించారని సమాచారం.