బంగీ జంప్ చేస్తూ స్టార్ హీరోయిన్ మృతి అంటూ ప్రచారం.. చివరికి ఏమైందంటే..?

బంగీ జంప్ చేస్తూ స్టార్ హీరోయిన్ మృతి  అంటూ ప్రచారం.. చివరికి ఏమైందంటే..?

సోషల్ మీడియాలో పాపులర్ కావాలని కొందరు ఆకతాయిలు చేసే పనుల కారణంగా సినీ సెలెబ్రెటీలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.  బాలీవుడ్ ప్రముఖ నటి, స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించిన నోరా ఫతేహి మృతి చెందిందంటూ ఓ ఇన్స్టాగ్రామ్ పేజీ షేర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నోరా ఫతేహి బంగీ జంప్ చేసేందుకు ఎత్తైన ప్రదేశం నుంచి దూకింది దీంతో రోప్ తెగిపోవడంతో పైనుంచి క్రిందపడి నోరా ఫతేహి ప్రాణాలు కోల్పోయిందని నకిలీ ఫోటోలు జత చేసి షేర్ చేశారు. 

దీంతో ఒక్కసారిగా నోరా అభిమానులు, బంధువులు టెన్షన్ పడ్డారు. కానీ బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం నోరా ఫతేహి క్షేమంగా ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అంతేగాకుండా బంగీ జంప్ చేస్తూ మృతి చెందిన మహిళ, నోరా ఫతేహి ఒకరు కాదని తేలింది. దీంతో నోరా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే నోరా ఫతేహి మృతిచెందిందంటూ ఫేక్ వీడియో షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకి ట్యాగ్ చేస్తున్నారు. 

దీంతో పేజీ నిర్వాహకులు ఆ ఫేక్ వీడియోని తొలగించారు. కానీ అప్పటికే ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది సంతాపం తెలియజేస్తూ కామెంట్లు, పోస్టులు షేర్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై నోరా ఫతేహి స్పందిస్తూ క్షేమంగా ఉన్నట్లు వీడియో ద్వారా తెలియజేస్తే ఈ తప్పుడు ప్రచారాలకు పులిస్టాప్ పడుతుందని అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించిన నోరా ఫతేహి తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితమే. ఆమధ్య తెలుగులో ప్రముహా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. కానీ మట్కా సినిమా ఫ్లాప్ అవ్వడంతో నోరా ఫతేహి కి పెద్దగా గుర్తింపు లభించలేదు.