సినిమాల్లోకి రాకముందు అలాంటి సమస్యలతో బాధపడ్డ స్టార్ హీరో డాటర్.. కానీ ఇప్పుడు..

సినిమాల్లోకి రాకముందు అలాంటి సమస్యలతో బాధపడ్డ స్టార్ హీరో డాటర్.. కానీ ఇప్పుడు..

హిందీలో ప్రముఖ దర్శకుడు అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన "కేదార్ నాథ్" అనే సినిమా ద్వారా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సారా అలీఖాన్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచమైంది. సినిమాల్లోకి రాకముందు సారా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేది. అయితే సారా అలీఖాన్ హిందీ ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు. దీంతో స్టార్ హీరో డాటర్ కావడంతో ఇండస్ట్రీలో ఆఫర్లు సులభంగా వచ్చాయని, అలాగే సారా అలీఖాన్ పై నెపోటిజం ప్రభావం ఎక్కువగా ఉందని అప్పట్లో పలు గుసగుసలు వినిపించాయి. ఇటీవలే సారా అలీఖాన్ ఓ ఇంటర్వూలో ఈ విషయాల గురించి మాట్లాడింది.

ఇందులో భాగంగా తాను సినిమాల్లోకి రాకముందు ఓవర్ వెయిట్ సమస్యతో బాధ పడేదానినని దీంతో ఈ ప్రభావం మెంటల్ హెల్త్ కూడా పడిందని తెలిపింది. అయితే ఈ ఓవర్ వెయిట్ సమస్యని అధిగమించేందుకు జిమ్ వర్కౌట్లు చెయ్యడం, ప్రత్యేక ఆహార డైట్ పాటించడం వంటివి చేశానని చెప్పుకొచ్చింది. ఇక మెంటల్ హెల్త్ కోసం యోగ చెయ్యడం, పుస్తకాలు చదవడం వంటివి అలవర్చున్నానని దీంతో సులభంగా ఓవర్ వెయిట్ తో మెంటల్ హెల్త్ సమస్యలనుంచి బయటపడ్డానని తెలిపింది. 

Also Read :- అడివి శేష్ స‌ర్ప్రైజ్ పోస్ట్.. ఆ రెండు పాన్ ఇండియా సినిమాల అప్డేట్స్

ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో స్ట్రెస్, ప్రెజర్ వంటివి హేండిల్ చెయ్యడం చాలా కష్టమని వీటితోపాటూ క్రిటిసిజం కూడా ఎదుర్కున్నానని చెప్పుకొచ్చింది. దీంతో తనని జడ్జ్ చేసే అవకాశం మరొకరికి ఇవ్వకుండా కష్టపడి శ్రమించి బరువు తగ్గడంతోపాటూ మెంటల్ గా కూడా స్ట్రాంగ్ అయ్యానని తెలిపింది. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సారా అలీఖాన్ స్కై ఫోర్స్ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకులు అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కేవ్లాని కలసి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.