చెప్పులేసుకొని జెండా ఎగరేసిన శిల్పా శెట్టి.. కామన్​సెన్స్​ లేదా?

చెప్పులేసుకొని జెండా ఎగరేసిన శిల్పా శెట్టి.. కామన్​సెన్స్​ లేదా?

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి(Shilpa shetty) ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. నిన్న ఇండిపెండెంట్స్​ డే సందర్భంగా ఈ నటి తన ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ ఫొటోలు నెట్టింట షేర్​ చేయడంతో అసలు సమస్య మొదలైంది. ఈ ఫొటోలో ఆమె తన ఫ్యామిలీతో పాటు చెప్పులేసుకుని జెండాను ఎగురవేసింది. దీనిపై నెటిజన్లు ట్రోలింగ్​కి దిగారు.

ఈ నటికి  ఈ మాత్రం కామన్​సెన్స్​ లేదా? అంటూ మండిపడుతున్నారు. ఈ ట్రోలింగ్​పై శిల్పా శెట్టి స్పందించింది. నెటిజన్లకు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చింది. ఈ టైంలో చెప్పులేసుకోకూడదన్న రూల్​ ఎక్కడా లేదని తెలిపింది. గూగుల్​ నుంచి ఇందుకు సంబంధించిన ఓ స్క్రీన్​షాట్​ను కూడా షేర్​ చేసింది. మీలా పనిగట్టుకుని విమర్శలు చేసేవారిని నేనస్సలు పట్టించుకోనంటూ తెలిపింది.