కుంభమేళా మోనాలిసాకు సినిమా ఛాన్స్

కుంభమేళా మోనాలిసాకు సినిమా ఛాన్స్
  • తన సినిమాలో చాన్స్ ఇస్తానన్న డైరెక్టర్ సనోజ్ మిశ్రా

ప్రయాగ్ రాజ్ : మహాకుంభమేళాలో స్పెషల్‌‌‌‌ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచిన అమ్మాయి మోనాలిసా భోస్లే(16)కు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకోనున్నారు. ఆమె రూపం, అమాయకత్వానికి తాను ఫిదా అయ్యానని సనోజ్‌‌‌‌ మిశ్రా తెలిపారు. ఆమెకు తన మూవీలో చాన్స్‌‌‌‌ ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తొందరలోనే ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌కు వెళ్లి ఆమెను కలుస్తానని పేర్కొన్నారు. మోనాలిసాది మధ్య ప్రదేశ్​లోని ఇండోర్. ఆమె కుటుంబం తరతరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. 

తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతున్నది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌కు వచ్చింది. అక్కడే మోనాలిసా అమాయకపు మొహం, కాటుక దిద్దిన తేనె కాళ్లు చూసి కొంతమంది ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్​గా మారింది.