Shocking Comments: ఎన్టీఆర్, మహేష్, విజయ్ నకిలీ మనుషులు.. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్

Shocking Comments: ఎన్టీఆర్, మహేష్, విజయ్ నకిలీ మనుషులు.. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్

టాలీవడ్ స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ వీరేందర్ చావ్లా. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయా హీరోల ఫ్యాన్స్ ఫోటోగ్రాఫర్ వీరేందర్ చావ్లాపై రెచ్చిపోతున్నారు దారుణంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ మండిపడుతున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ గా పేరుతెచ్చుకున్నారు వీరేందర్ చావ్లా. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సౌత్ స్టార్స్ గురించి, వారి ప్రవర్తన గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సౌత్ ఇండస్ట్రీ స్టార్స్ చాలా నకిలీగా ఉంటారు. వారు బయట ఒకరకంగా.. లోపల మరో రకంగా నటిస్తూ ఉంటారు. విజయ్ దేవరకొండ సింపుల్ గా ఉంటానని తెలియడానికి కావాలని ఈవెంట్స్ కి చెప్పులతో వస్తాడు. ఇటీవల ఎన్టీఆర్ కూడా ఓ హోటల్ లో ఫోటోగ్రాఫర్ పై మండిపడ్డాడు. మహేష్ బాబు కూడా బాలీవుడ్ తనను భరించలేదని చెప్పాడు. 

ఇవన్నీ చూస్తుంటే వారు కావాలనే మంచిగా కనిపించడానికి ట్రై చేస్తున్నారని, కాకపోతే వారు నకిలీ మనుషులు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ ముగ్గురు హీరోల ఫ్యాన్స్ వీరేందర్ చావ్లా పై మండిపడుతున్నారు. వాళ్ళ గురించి ఎం తెలుసనీ మాట్లాడుతున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. వారు కేవలం సినిమాల్లోనే కాదు బయట సేవ గుణంలో కూడా హీరోలు. వారు చేసే ఛారిటీల గురించి తెలుసా నీకు. అవన్నీ తెలుసుకొని మాట్లాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరేందర్ చావ్లా చేసిన కామెంట్స్ రెండు ఇండస్ట్రీల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి.