Udit Narayan: ముదిరిన ముద్దు వివాదం.. సెల్ఫీల కోసం వచ్చిన లేడీ ఫ్యాన్స్ కి ముద్దు పెట్టిన సింగర్..

Udit Narayan: ముదిరిన ముద్దు వివాదం.. సెల్ఫీల కోసం వచ్చిన లేడీ ఫ్యాన్స్ కి ముద్దు పెట్టిన సింగర్..

ప్రముఖ సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ్ టాలీవుడ్ సైన్ ప్రేక్షకులకు సుపరిచితమే.. ఇప్పుడంటే సింగర్స్ ఎక్కువయ్యారు కానీ ఒకప్పుడు మెలోడీస్  సాంగ్స్ కి పెట్టింది పేరు ఈ సీనియర్ సింగర్. ఇప్పటితరం ఆడియన్స్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ మధ్య వచ్చిన మత్తు వదలరా 2 సినిమాలో కమెడియన్ సత్య పాడిన "నీవు గాలి గోపురం... నేను ప్రేమ పావురం" సాంగ్ ఉదిత్ నారాయణ్ పాడిందే. 

ఇక అసలు విష్యం లోకి వెళితే ఈ మధ్య సింగర్ ఉదిత్ నారాయణ్ పాటలు పడటం లేదు కానీ మ్యూజిక్ కాన్సెర్ట్స్ తో తన అభిమానులని అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే ఓ మ్యూజిక్ కాన్సెర్ట్ లో స్టేజీమీద పాటలు పాడుతూ ఉండగా కొందరు ఫ్యాన్స్ సెల్ఫీల కోసం స్టేజీ దగ్గరికి వచ్చారు. దీంతో ఉదిత్ నారాయణ్ వారికి సెల్ఫీలు ఇచ్చే క్రమంలో చెంపపై ముద్దు కూడా పెట్టాడు. ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నప్పటికీ ఈ వీడియో ని మాత్రం కొందరు నెటిజన్లు వైరల్ చేస్తూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. 

దీంతో ఈ విషయంపై సింగర్ ఉదిత్ నారాయణ్ స్పందించాడు. ఇందులోభాగంగా అభిమానులంటే తనకి చాలా ఇష్టమని వారివల్లే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని అన్నాడు. ఇక ముద్దు కాంట్రవర్సీపై మాట్లాడుతూ తాను చెడు ఉద్దేశంతో ముద్దు పెట్టలేదని కేవలం  అభిమానం, ఇష్టంతోనే లా చేసానని క్లారిటీ ఇచ్చాడు. 

ALSO READ | Daaku Maharaaj: బిగ్ షాక్.. ఆన్‍లైన్‍లో డాకు మహారాజ్ HD వెర్షన్ లీక్.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే పైరసీ ఏందీ సామి!

అలాగే సెలెబ్రెటీలు బయటికొచ్చిన సందర్భాల్లో ఫ్యాన్స్ హగ్ చేసుకోవడం, ఆటోగ్రాఫ్ తీసుకోవడం, హ్యాండ్స్ షేక్ చెయ్యడం వంటివి చేస్తుంటారని ఇవన్నీ కూడా ఆత్మీయతతో కూడుకున్నవని అందులో ఎలాంటి దురుద్దేశం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సమాజంలో తనకి మంచి పేరుతోపాటూ మర్యాద, ఆదరాభిమానాలు ఉన్నాయని దాంతో కాంట్రవర్సీలకి కూడా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా సింగర్ ఉదిత్ నారాయణ్ దాదాపుగా 40 ఏళ్లపాటు తన గాత్రంతో ఉదిత్ నారాయణ్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. 36 వేర్వేరు భాషలలో 25,000 కి పైగా పాటలు పాడారు. తెలుగులో ప్రముఖ సంగీత దర్శకులు కోఠీ, ఎంఎం కీరవాణి, ఏఆర్ రెహమాన్, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ తదితరులతో కలసి పని చేశాడు. ప్రస్తుతం ఉదిత్ నారాయణ్ కో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.