బాలీవుడ్‌‌‌‌లో రీఎంట్రీ 

బాలీవుడ్‌‌‌‌లో రీఎంట్రీ 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యారు రజినీకాంత్. ఇటీవలే కూతురు డైరెక్షన్‌‌‌‌లో ‘లాల్‌‌‌‌ సలామ్‌‌‌‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన.. ఇప్పుడు ‘వెట్టైయన్‌‌‌‌’ చిత్రంలో నటిస్తున్నారు. టీజే జ్ఞానవేల్‌‌‌‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో జరుగుతోంది. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్‌‌‌‌తో పాటు ఫహద్ ఫాజిల్ కాంబినేషన్‌‌‌‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మార్చి రెండో వారం వరకూ ఈ షెడ్యూల్ కొనసాగనుంది.

రజినీకాంత్ పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా, అమితాబ్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఓ బాలీవుడ్ సినిమాకు రజినీకాంత్‌‌‌‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్‌‌‌‌వాలా ప్రొడక్షన్‌‌‌‌లో ఓ సినిమా ఓకే అయ్యింది.

రజినీకాంత్‌‌‌‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ, ఆయనతో కలిసి వర్క్ చేయనుండటం సంతోషంగా ఉందని సాజిద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌‌‌‌లో ఆయన ఓ సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు ‘జైలర్‌‌‌‌‌‌‌‌’కు సీక్వెల్ కూడా తెరకెక్కనుంది.