Alka Yagnik: అరుదైన వ్యాధి కారణంగా చెవుడు.. టాప్ సింగర్ ఎమోషనల్ పోస్ట్

Alka Yagnik: అరుదైన వ్యాధి కారణంగా చెవుడు.. టాప్ సింగర్ ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్‌లో టాప్ సింగర్ అల్కా యాగ్నిక్ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఆ వ్యాధి కారణంగా ఆమెకు చెవుడు వచ్చిందట. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఆమె వచ్చిన అరుదైన వ్యాధి గురించి ఆమె మాట్లాడుతూ.. కొంత కాలంగా నేను బయట కనిపించడంలేదని చాలా మంది ఆగుతున్నారు. దానికి కారణం.. నేను ప్రస్తుతం అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ అనే వ్యాధితో భాదపడుతున్నాను.

కొన్ని వారాల క్రితం నేను ఫ్లైట్ దిగి వస్తుంటే నాకేమీ వినబడలేదు. అదే విషయాన్ని డాక్టర్స్ కి చెప్పగా.. వారు నాకు సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ ఉందని చెప్పారు. వైరల్ ఎటాక్ వల్ల ఇలా జరిగిందని, ఇది నేను అస్సలు ఊహించలేదని ఆమె అన్నారు. అంతేకాదు.. పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించమని ఆమె తన అభిమానులకు సూచించారు. ఇక త్వరలోనే నేను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను.. అల్కా యాగ్నిక్ చెప్పుకొచ్చారు.

ఇక అల్కా యాగ్నిక్ విషయానికి వస్తే.. 90 దశకంలో ఆమె హిందీలో టాప్ సింగర్ గా కొనసాగారు. మొత్తం 25 భాషల్లో  21 వేలకు పైగా పాటలు పాడిన ఆమె చాలా సింగింగ్ షోలుక్ జెడ్జ్ గా కూడా వ్యవరించారు. అంతేకాదు.. 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్టుగా గిన్నిస్ రికార్డు కూడా సాధించారు అల్కా యాగ్నిక్.