Sunny Leone: ఖరీదైన ఆఫీస్ కొన్న సన్నీ లియోన్.. ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

Sunny Leone: ఖరీదైన ఆఫీస్ కొన్న సన్నీ లియోన్.. ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

స్పెషల్ సాంగ్స్ లో నటించి పాపులర్ అయ్యింది బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటి సన్నీ లియోన్. అయితే సన్నీలియోన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో మోడలింగ్ కూడా నిర్వహించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అంటూ వరుస భాషల్లో ఆఫర్లు దక్కించుకుని తన అందచందాలతో తనకంటూ కొద్దిమంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. అయితే ఇటీవలే నటి సన్నీ లియోన్ ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది.

నార్త్ ముంబైలోని ఓషివారా ప్రాంతంలో దాదాపుగా రూ.8 కోట్లు వెచ్చించి సన్నీ లియోన్ కమర్షియల్ బిల్డింగ్ ని కొనుగోలు చేసింది. ఈ కమర్షియల్ బిల్డింగ్ లో తన కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు ఫిబ్రవరి 2025లో నమోదు చేయబడిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్‌సైట్‌లో స్క్వేర్ యార్డ్స్ లోని ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం తెలుస్తోంది.

IGR రికార్డుల ప్రకారం, ఈ ఆస్తి 176.98 చదరపు మీటర్ల (1,904.91 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా మరియు 194.67 చదరపు మీటర్ల (2,095 చదరపు అడుగులు) బిల్ట్-అప్ ఏరియా కలిగి ఉంది. ఇందులో మూడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ.35.01 లక్షల స్టాంప్ డ్యూటీ మరియు రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు సన్నీ లియోన్ చెల్లించింది.

ప్రస్తుతం సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్స్ లో నటించడమేకాకుండా పలు సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది. అంతేకూండా పలు సంస్థల బ్రాండ్స్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొంటోంది. ఈమధ్యనే పలు స్టార్టప్స్ ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం.