వామ్మో.. రూ.125 కోట్లు ట్యాక్స్ కట్టిన స్టార్ హీరో.. సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

వామ్మో.. రూ.125 కోట్లు ట్యాక్స్ కట్టిన స్టార్ హీరో.. సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఈమధ్య కాలంలో సినిమా ఫీల్డ్ లో బిజినెస్ బ్యాండ్ విడ్త్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. దీంతో దర్శక నిర్మాతలు బడ్జెట్ పెట్టడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. అంతేకాదు హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగింది. దీంతో హీరోలు ఏకంగా రూ.100 కోట్లు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే ఇండియన్ సినీ చరిత్రలోనే ఇప్పటివరకూ అత్యధికంగా ట్యాక్స్ కట్టిన హీరో మేటర్  ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 8పదుల వయసులో కుడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే బిగ్ బీ 2024-25 సంవత్సరానికి గానూ దాదాపుగా రూ.365 కోట్లు పైగా ఆదాయం అర్జినించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది దాదాపుగా  రూ.120కోట్లు ఇన్కమ్  ట్యాక్స్ కట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ సినీ ఇండస్ట్రీకి సంబందించిన హీరోలెవరూ ఇంత పెద్ద మొత్తంలో ట్యాక్స్ కట్టినట్లు దాఖలాలు లేవు. అయితే అమితాబ్ బచ్చన్ కి సినిమాలతోపాటూ పలు ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయి. దీంతో  సినిమాలతోనే కాదూ ఇతర బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్స్ తో కూడా బాగానే సంపాదిస్తున్నాడు. 

Also Read :- శబరిమల అయ్యప్ప సన్నిదిలో మమ్ముట్టీ కోసం మోహన్‌ లాల్‌ ప్రత్యేక పూజలు

ఇప్పటివరకూ సినీ ఇండస్ట్రీలలో హైయెస్ట్ ట్యాక్స్ కట్టే హీరోల లిస్టులో షారుఖ ఖాన్ (రూ.92) టాప్ 2 లో కొనసాగుతున్నాడు. తమిళ్ తళపతి విజయ్(రూ.80) కోట్లు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు), మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం తెలుగులో కల్కి 2 2898AD సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యఔంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకునే, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్, కీరి సురేష్ (బుజ్జి వాయిస్ ఓవర్), కమల్ హాసన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలు కానుంది..