బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ పెళ్లికొడుకయ్యాడు. తలపాగా పెట్టుకుని షేర్వాణీ ధరించి పెళ్లికొడుకులాగా మారిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే ఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీకి రణబీర్ కపూర్ షో స్టాపర్ గా మారాడు. వింటర్ 2024 వెడ్డింగ్ కలెక్షన్స్ లో భాగంగా రణబీర్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా బారాత్ లో పాల్గొని ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈవెంట్ లో రణబీర్ ఐవరీ, బ్లష్ పింక్ షేర్వానీ, దుప్పట్టా ధరించి పైన తలపాగా పెట్టుకున్నాడు. అదే సమయంలో బ్రహ్మాస్త్ర మూవీ నటుడు పాతకాలం నాటి కారులో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇద్దరూ కలిసి కారుపై ఊరేగారు. అనంతరం స్టార్స్ అంతా స్టేజిపై తెగ సందడి చేశారు. ఈవెంట్ చివర్లో అలియాతో తన వివాహం జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఇక రణబీర్ సినిమాలకు వస్తే రామాయణం మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. సినిమాలో రణబీర్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ తెగ వైరల్ అయింది. త్వరలోనే మేకర్స్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.