![ప్రభాస్ అన్న సినిమాలో చిన్న పాత్ర చేయడానికైనా సిద్ధం](https://static.v6velugu.com/uploads/2023/11/bollywood-star-hero-ranbir-kapoor-shocking-comments-about-prabhas-spirit-movie_RuxvaKwdJQ.jpg)
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). మోస్ట్ వైలెట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ అండ్ సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసింది. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం రన్బీర్ ఫ్యాన్స్ తో ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక తాజాగా యానిమల్ మూవీ ప్రేమోషన్స్ లో భాగంగా రణ్ బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు హాజరయ్యారు. ఈ షోలో ప్రభాస్ తరువాతి సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు రణ్బీర్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. సందీప్ తన నెక్ట్స్ సినిమా ప్రభాస్ అన్నతో చేస్తున్నాడు. ఆ సినిమాలో చిన్న పాత్ర చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు రణ్బీర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫులుగా ట్రెండ్ అవుతోంది. మరి నిజంగా సందీప్ రణ్బీర్ కోసం చిన్న పాత్రనైనా క్రియేట్ చేస్తాడా అనేది చూడాలి.