తన పేరుమీదుగా జరుగుతున్న మోసాలపై స్పందించిన స్టార్ హీరో..

తన పేరుమీదుగా జరుగుతున్న మోసాలపై స్పందించిన స్టార్ హీరో..

ఈ మధ్య కొందరు కేటుగాళ్లు సినీ సెలెబ్రెటీల ఫేమ్ ని ఉపయోగించుకుని అడ్డదారుల్లో డబ్బు సంపాదించాడనికి యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అలాగే ఇంటర్నెట్ వంటి మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. 

బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ మ్యూజిక్ కన్సర్ట్స్ పేరు మీదుగా  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొద్దిరోజులుగా ఈమెయిల్స్, మెసేజ్లు వంటివి పంపిస్తూ సల్మాన్ ఖాన్ అభిమానులను మోసం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. 

ఇందులో భాగంగా ఈ ఏడాది యూఎస్ఏలో తాను మరియు తన బృందం ఎలాంటి ప్రదర్శనలు, కచేరీలు ఇవ్వడంలేదని కాబట్టి తనపేరు మీదుగా వస్తున్న నకిలీ కన్సర్ట్స్ ఈ-మెయిల్స్ మరియు అసత్య ప్రచారాలను నమ్మవద్దని తన అభిమానులకు సూచించాడు. అంతేగాకుండా తన పేరును మోసపూరిత ప్రయోజనాల కోసం తప్పుగా ఉపయోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని కూడా హెచ్చరించాడు.

ALSO READ | త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని నటి పూనం కౌర్ సంచలన ట్వీట్..

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హిందీలో సికిందర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ్ ప్రముఖ దర్శకుడు మురగదాస్ దర్శకత్వం వహిస్తుండగా బ్యూటీఫుల్ హీరోయిన్ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. కాగా  ప్రస్తుతం సికిందర్ చిత్రం ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.