అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రెస్పాన్సిబుల్ గా ఉండాలంటూ కామెంట్స్

అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన  బాలీవుడ్ స్టార్ హీరోయిన్..  రెస్పాన్సిబుల్ గా ఉండాలంటూ  కామెంట్స్

టాలీవుడ్ ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి భాషతో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని భాషల సినీ పరిశ్రమలనుంచి అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా నేషనల్ వైడ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ ని రిలీజ్ చెయ్యాలని కామెంట్లు చేస్తున్నారు. 

అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపి ఎంపీ, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ స్పందించింది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం దురదృష్టకరమని అన్నారు. అలాగే తాను అల్లు అర్జున్ కి బిగ్ సపోర్టర్ అని తెలిపింది. అయితే చట్టం దృష్టిలో అందరూ సమానమని, అలాగే హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా భాద్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ALSO READ | Allu Arjun case : అల్లు అర్జున్ అరెస్ట్పై ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు..

సంధ్య థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ  థియేయటర్లలో ధూమపాన ప్రకటనలు ప్రసారం చెయ్యడంతో పాటూ రద్దీ ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కూడా ముఖ్యమని ఎందుకంటే ప్రజల జీవితాలు కూడా చాలా విలువైనవని అని పేర్కొంది. దీంతో ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం కలిగి ఉండాలని తెలిపింది.

ALSO READ | ప్రాణం పోయిన అరెస్ట్ చేయొద్దా..? అల్లు అర్జున్ అరెస్ట్‎పై CM రేవంత్ హాట్ కామెంట్స్

ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించాడు. ఇందులోభాగంగా ‘‘అల్లు అర్జున్ అరెస్ట్ కావడం దురదృష్టకరం. -సేఫ్టీ ప్రోటోకాల్‌ విషయంలో యాక్టర్ ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరు.. ఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదు’’ అని అన్నారు.

ఇక అల్లు అర్జున్ అరెస్ట్ విషయానికొస్తే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధిచి విచారించాలని నాంపల్లి కోర్టు పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించగా అల్లు అర్జున్ కి సానుకూలంగా స్పందింస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో కండీషన్స్ తో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే విచారణ పూర్తయ్యేంతవరకూ దేశం దాటి వెళ్లరాదని ఆంక్షలు విధించింది.