స్టార్ హీరోతో డేటింగ్ పై స్పందించిన వెటరన్ హీరోయిన్... ఏమన్నారంటే..?

స్టార్ హీరోతో డేటింగ్ పై స్పందించిన వెటరన్ హీరోయిన్... ఏమన్నారంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, పంకబ్ కింగ్స్ ఐపీయల్ జట్టు ఓనర్ ప్రీతీ జింటా కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ వ్యవహారంపై స్పందిచింది. అయితే ఇటీవలే సల్మాన్ ఖాన్ పుట్టినరోజు కావడంతో ప్రీతీ జింటా సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ కి బర్త్ డే విషెష్ చెప్పింది. అంతగాకుండా గతంలో స్లామం తో దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది. దీంతో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మీరు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేశారా అని అడిగాడు. 

దీంతో ప్రీతి జింటా కూల్ గా రిప్లై ఇచ్చింది. ఇందులో సల్మాన్ ఖాన్ తో తాను డేటింగ్ చెయ్యలేదని అలాగే అతడు నాకు మంచి సన్నహితుడని తెలిపింది. ఇక సల్మాన్ తన కుటుంబ సభ్యుడితో సమానమని అలాగే తన భర్త జీన్ గూడెనఫ్ కి మంచి స్నేహితుడని.. నా ఆన్సర్ మీకు ఆశ్చర్యం కలిగించుంటే ఐయాం సారీ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఆ నెటిజన్ షాక్ అయ్యాడు. ఈ విషయంపై కొందరు ప్రీతీ అభిమానులు స్పందిస్తూ సినీ సెలెబ్రేటీలకి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని కాబట్టి వారిని సోషల్ మీడియాలో ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇబందిపెట్టడం సరికాదని అంటున్నారు. 

ALSO READ | లండన్ లో ఫ్యామిలీతో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్...

ఈ విషయం ఇలా ఉండగా ప్రీతీ జింటా తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ప్రీతీ పెర్ఫార్మెన్స్ కి తెలుగు ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు కానీ ఏమైందో ఏమోగానీ మళ్ళీ ఈ పంజాబీ బ్యూటీ తెలుగు సినిమాల్లో నటించలేదు. అయితే పెళ్లయిన తర్వాత కుటుంబ బాధ్యతలు చక్కబెట్టే పనిలోపడిన ప్రీతి జింటా సినిమాలకి పెద్దగా సమయం కేటాయించలేక పోయింది. దీంతో మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో వస్తున్న"లాహోర్ 1947" అనే సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ రాజ్ కుమార్.