టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె ఇప్పటివరకు ఒక్క స్ట్రయిట్ తెలుగు మూవీ కూడా చేయలేదు. తాజాగా తన టాలీవుడ్ ఎంట్రీని అనౌన్స్ చేశారు మేకర్స్. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్‌‌‌‌ ‘జటాధర’ చిత్రంతో  సోనాక్షి సిన్హా తెలుగు తెరకు పరిచయమవుతోందని ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఆమె పోస్టర్‌‌‌‌ ఆకట్టుకుంది. కంప్లీట్ ఫేస్ రివీల్ చేయకుండా చేతిని అడ్డుపెట్టుకున్న సోనాక్షి లుక్ ఇంప్రెస్ చేస్తోంది.

 ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, నేటి నుంచి సోనాక్షి షూట్‌‌లో జాయిన్ కానుంది. వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా  రూపొందిస్తున్న  ఈ  చిత్రాన్ని  జీ స్టూడియోస్‌‌,  ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు.  అనంత పద్మనాభ స్వామి ఆలయం,  అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర లాంటి అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.