హైదరాబాద్ లో కాంచన 4 షూటింగ్.. హాట్ బ్యూటీ ని దింపుతున్న లారెన్స్..

హైదరాబాద్ లో కాంచన 4 షూటింగ్.. హాట్ బ్యూటీ ని దింపుతున్న లారెన్స్..

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన కాంచన సిరీస్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో గతంలో లారెన్స్ తీసిన కాంచన1, కాంచన 2, కాంచన 3 తదితర సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సిరీస్ ని వదలడం లేదు లారెన్స్. దెయ్యాలతో ఆటాడుకుంటున్నాడు. ప్రస్తుతం కాంచన 4 సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుపుకుంటోంది.

అయితే ఈ సినిమాలోని ఓ కామిక్ పాత్ర కోసం బాలీవుడ్ స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ని తీసుకున్నట్లు సమాచారం. ఈ మధ్య నోరా ఫతేహి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా స్పెషల్ సాంగ్స్ తోపాటూ, ఏదైనా మంచి సినిమా అఫర్ వచ్చినా సరే వెంటనే ఒకే చెబుతోంది. ప్రస్తుతం నోరా ఫతేహి కాంచన 4 షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ చేస్తుందా లేక కామిక్ రోల్ లో కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 

ALSO READ | Laila Bookings: లైలా మూవీ పెద్దలకు మాత్రమే (A సర్టిఫికెట్) : టికెట్లు చూసి బుక్ చేసుకోండి ఫ్యామిలీస్

ఈ వియషం ఇలా ఉండగా నటి నోరా ఫతేహి హిందీలో దిల్ బార్ అనే సాంగ్ రీమేక్ లో నటించి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. బాహుబలి సినిమాలోని మనోహరి సాంగ్ తో కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఇటీవలే తెలుగులో ప్రముఖ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో నోరా కి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఆఫర్లు మాత్రం బాగానే వరిస్తున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)