
Sikandar movie first day collections: బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "సికందర్" మూవీ రంజాన్ సందర్భంగా ఆదివారం (మార్చ్ 30) రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి టికిల్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. భారీ అంచానాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది .
Also Read :- కుంభమేళా సెన్సేషన్ మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్
మొదటి రోజు మినిమం రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని మేకర్స్ భావించారు. కానీ నెగిటివ్ టాక్ రావడంతో కేవలం రూ.30 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ లో కూడా టికెట్లు తెగడం లేదని తెలుస్తోంది. రంజాన్ పండుగ సెంటిమెంట్ ని వర్కౌట్ చేసేందుకు మేకర్స్ చేసిన ప్రయత్నం పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఔట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం, ల్యాగ్ ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో సికిందర్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీనికితోడు రిలీజ్ కి ముందే హెచ్డీ ప్రింట్ ఇంటర్ నెట్ లో లీక్ అవడంతో ఈ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. అయితే బాలీవుడ్ లో ఇప్పటివరకూ శుక్రవారం కాకుండా ఆదివారం రిలీజ్ అయిన సినిమాలలో టైగర్ 3 సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించిన లిస్టులో టాప్ లో కోనసాగుతోంది.
ఇక ఈ సిమ్ క్యాస్ట్ & క్రో విషయానికొస్తే బాహుబలి మూవీ ఫేమ్ సత్య రాజ్, బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, స్టార్ హీరో సునీల్ శెట్టి, షర్మాన్ జోషి, కిషోర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.