Pushpa 2: రోజురోజుకి పెరుగుతున్న హైప్.. పుష్ప 2లో మరో స్టార్!

Pushpa 2: రోజురోజుకి పెరుగుతున్న హైప్.. పుష్ప 2లో మరో స్టార్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు సుకుమార్(Sukumar) తెరకేకించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2(Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు సంవత్సర కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి విడుదలైన వేర్ ఈజ్ పుష్ప అనే వీడియో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అప్పటినుండి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా పుష్ప 2 నుండి వినిపిస్తున్న మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. పుష్ప 2 మూవీలో మరో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నటించబోతున్నాడట. ఆ స్టార్ యాక్టర్ ఎవరో కాదు సంజయ్‌ దత్‌. అవును.. ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ నేషనల్ వైడ్ ట్రెండ్  అవుతోంది. 

త్వరలోనే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రానుందట. ఇక సంజయ్ దత్ ఎంట్రీ న్యూస్ తో పుష్ప 2పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కారణం.. సంజయ్ దత్ ఈ మధ్య నటించిన రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అందులో ఒకటి కేజీఎఫ్ కాగా.. మరొకటి లియో. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. వాటిలాగే ఇప్పుడు పుష్ప 2కూడా  బిగ్గెస్ట్ నిలవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇన్ని స్పెషాలిటీల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.