స్టార్ హీరో ఫోటోలు మార్ఫింగ్.. అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాడంటూ ప్రచారం...

స్టార్ హీరో ఫోటోలు మార్ఫింగ్.. అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాడంటూ ప్రచారం...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఎలాంటి వార్త అయినా ఇట్టే వైరల్ అయిపోతోంది. ఈక్రమంలో కొందరు పాపులర్ అవ్వడానికి సినీ సెలెబ్రెటీల ఫోటోలను మార్ఫింగ్ చెయ్యడం, తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యడం వంటివి చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

పూర్తివివరాల్లోకి వెళితే సౌత్ ఇండియా కి చెందిన ఓ యువకుడు గతంలో షారుఖ్ ఖాన్ హాస్పిటల్ లో చేరిన ఫొటోలని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేగాకుండా షారుఖ్ ఖాన్ ఆరోగ్యం బాగాలేదని దీంతో త్వరగా ఆయన కోలుకోవడానికి దేవుడుని ప్రార్థించండి అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో కొందరు షారుఖ్ ఖాన్ అభిమానులు షారుఖ్ ఖాన్ త్వరగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావాలని ప్రార్థనలు చేస్తన్నారు. అలాగే తమ అభిమాన నటుడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 

అయితే కొందరు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అసలు విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించగా అసలు నిజం బయటపడింది. ఈక్రమంలో గత ఏడాది ఐపీయల్ సమయంలో షారూఖ్ ఖాన్ కొంతమేర అస్వస్థతకి గురై హాస్పిటల్ లో చేరిన సమయంలో తీసిన ఫోటోలుగా గుర్తించారు. కాబట్టి టెన్షన్ పడవద్దని సూచిస్తున్నారు.  అలాగే షారుఖ్ ఖాన్ ఫోటోలని మార్ఫింగ్ చేసి ఫ్యాన్స్ ని ఆందోళనకి గురి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులని కోరుతున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన వారసులని ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇందులోభాగంగా కూతురు సుహానా ఖాన్ నటిస్తున్న సినిమా స్క్రిప్ట్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ సినిమాకి లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ తో అలరించిన ప్రముఖ డైరెక్టర్ సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా వచ్చే ఏడాది హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.