IPL 2025 ఓపెనింగ్ సెర్మనీ.. ఈ సీజన్ మరింత గ్రాండ్గా..

IPL 2025 ఓపెనింగ్ సెర్మనీ.. ఈ సీజన్ మరింత గ్రాండ్గా..

ఇంకా నెల రోజులు.. రెండు వారాలే.. ఇక వారమే.. ఐపీఎల్-2025 గురించి ఇలా నడుస్తోంది కౌంట్ డౌన్. ప్లేయర్ల ఆక్షన్ మొదలైనప్పటి నుంచీ.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. చాలా వరకు టికెట్స్ కూడా  బుక్ చేసుకుని రెడీగా ఉన్నారు. వచ్చే ప్రతి అప్ డేట్ చూసుకుంటూ.. ఈసారి సీజన్ ఫైట్ ఎలా ఉండనుందో ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తు్న్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో.. ఇక ఐపీఎల్ లో కూడా అంతకు మించిన థ్రిల్లింగ్ మ్యాచెస్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

ఈ సారి ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం అవుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గ్రాండ్ ఓపెనింగ్ కోసం ప్లాన్ చేసింది బీసీసీఐ. ఫస్ట్ మ్యాచ్ సందర్భంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ ఓపెనింగ్ సెరిమనీకి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. ఈసారి ఓపెనింగ్ సెరిమనీ బాలీవుడ్ స్టార్స్, సెలబ్రెటీస్ తో వెరీ రిచ్ లుక్, ఎంటర్టైన్ మెంట్ మోడ్ లో లాంచ్ చేస్తు్న్నారు. 

ALSO READ | IPL 2025: లెక్క మారింది.. ఈ సీజన్లో కెప్టెన్లు అంతా మనోళ్లే..!

ఓపెనింగ్ స్టేజ్ బాలీవుడ్ స్టార్స్, హాట్ పెయిర్ వరుణ్ ధవన్, శ్రద్ధా కపూర్ ల డ్యాన్సులతో మార్మోగనుంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో హీట్ పుట్టించే ఈ జంట.. ఇక ఐపీఎల్ నైట్ లో ఉర్రూతలూగిస్తారని భావిస్తున్నారు. 

వీరికి తోడు పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్ తన వాయిస్ తో మ్యాజిక్ చేయనున్నాడు. తన హిట్ సాంగ్స్ తో యూత్ ను ఊపేస్తుంటే.. తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో వరుణ్ ధవన్, శ్రధాకపూర్ అట్రాక్టివ్ గా నిలవడం ఈ సీజన్ స్పెషల్ అట్రాక్షన్.

మార్చి 22 రోజు IPL-2025 తొలి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఫస్ట్ మ్యాచ్ లో మెయిడెన్ విక్టరీ కోసం రెండు టీమ్స్ కసరత్తులు మొదలెట్టాయి. చూడాలి మరి.. థగ్ ఆఫ్ వార్ గా నిలవనున్న ఈ మ్యాచ్ లో బోణీ కొట్టేదెవరో.