
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఇప్పుడిదొక ప్రక్రియ మాత్రమే కాదు. పరిస్థితులను తారుమారు చేసే వ్యవస్థగా మారుతోంది. AI అనేది.. మనిషి మేధస్సు కోసం అవసరమయ్యే పనులను తేలికగా చేయడానికి కంప్యూటర్ సిస్టమ్‌లను సూచిస్తుంది. ఇలా, కొత్త సమస్యలను పరిష్కారించాల్సిన AI.. ఇప్పుడు కొత్త సమస్యలతో తలనొప్పి క్రియేట్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే..
జనరేటివ్ AI నుండి తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి సినిమా స్టార్స్ తమ వంతు ప్రయత్నంగా ముందుకు వస్తున్నారు. అనుమతి లేకుండా తమ వ్యక్తిగతమైన పోస్టర్స్ డిజైన్, వాయిస్ మాడ్యులేషన్, స్టేజీలపై ప్రదర్శనలను.. ఇలా ఏది జనరేట్ చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పకనే చెప్తున్నారు.
ఇందులో ముఖ్యంగా హాలీవుడ్ సినీ స్టార్స్ తమ కట్టుదిట్టమైన నిబంధనలను, తమ ఒప్పందంలో (IT ACT) కుదుర్చుకున్నారు. అలాగే, బాలీవుడ్ లోను ఈ నిబంధనను తమ ఒప్పందాలలో చేర్చడం మొదలుపెట్టారు. ఎందుకంటే.. ఇప్పటికే, పలు స్టార్ హీరోయిన్స్ పై జనరేటివ్ AI ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో బాలీవుడ్ పరిశ్రమ కట్టుదిట్టమైన నిబంధనలతో ముందుకెళ్తోంది.
అయితే, ఇందుకు తమిళ సినీ పరిశ్రమ.. AI వాడకంపై నిబంధనను అమలులో లేదని చిత్ర నిర్మాత మరియు పంపిణీదారు జి. ధనంజయన్ ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఇటీవల, AIని ఉపయోగించి ఒక చిత్రానికి తెలుగులో తన వాయిస్‌ను డబ్ చేయడానికి హీరో విజయ్ ఆంటోనీ నుండి అనుమతి పొందడానికి మేము ప్రయత్నించాము. కానీ అందుకు అతను నిరాకరించాడు. వృత్తిపరమైన బాధ్యత ప్రకారం, నిర్మాతలు ఎల్లప్పుడూ నటుల అనుమతిని కోరుతారు. అప్పుడు వారు అంగీకరిస్తేనే ముందుకు వెళతాం అని ధనంజయన్ చెప్పారు.
Also Read:-ఓటీటీకి వచ్చిన రెండు తమిళ కొత్త సినిమాలు..
ఇకపోతే, తమిళ ఇండస్ట్రీలో తన వ్యక్తిత్వాన్ని అనధికారికంగా ఉపయోగించడంపై ఫస్ట్ టైం సూపర్ స్టార్ రజనీకాంత్ రియాక్ట్ అయ్యారు. జనవరి 2023లో, తన అనుమతి లేకుండా వాణిజ్య లాభం కోసం తన వ్యక్తిత్వాన్ని (పేరు, ఇమేజ్ మరియు పోలిక) ఎవరైనా ఉపయోగించుకుంటే చట్టపరమైన మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఆయన నోటీసు జారీ చేశారు. అయితే, ఆ నోటీసులో AI వాడకం గురించి ప్రస్తావించలేదు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరోలపై AI ఎడిట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళంలో ఒక్కటనే కాదు తెలుగు హీరోలపైనా చేసిన ఎడిట్ ఫొటోస్ సైతం నెట్టింట్లో హల్ చెల్ చేస్తున్నాయి.
. #Thalaivar171 AI Edits 🔥🔥#Superstar #Rajinikanth #Sivakarthikeyan https://t.co/eRtc6nso37
— Chichilubu 💙❼ (@guruawesome) December 3, 2023
అలాగే, 2024లో, స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి కోర్టును ఆశ్రయించాడు. కోడిబుల్ వెంచర్స్ LLPపై కేసు దాఖలు చేశారు. అక్టోబర్ 2024లో, బాంబే హైకోర్టు, అరిజిత్ సింగ్ వర్సెస్ కోడిబుల్ వెంచర్స్ LLP కేసులో, "గాయకుడి పేరు, వాయిస్, ఇమేజ్ మరియు ఇతర వ్యక్తిగత లక్షణాలను అనధికారికంగా ఉపయోగించడం అతని హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని" తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చాలా మంది బాలీవుడ్ నటులకు తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి ఒక ఉదాహరణగా నిలిచింది.
అంటే, బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కంటే, తమిళ సినీ పరిశ్రమ AI నుండి తమ వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడానికి ఆలోచిస్తుంది. అయితే, సౌత్ సినీ స్టార్స్ సైతం తమ ఒప్పందాలలో AI వాడకానికి వ్యతిరేకంగా నిబంధనను గుర్తించి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది.