G2 కోసం రంగంలోకి OG విలన్.. సాలిడ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

G2 కోసం రంగంలోకి OG విలన్.. సాలిడ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

టాలెంటెడ్ హీరో అడవి శేష్(Adavi shesh) కెరీర్ లో మెమరబుల్ మూవీ అంటే టక్కున గుర్తొచ్చే పేరు గూఢచారి(Goodachari). 2018లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ భారీ విజయాన్ని సాధించింది. శశి కిరణ్ తిక్కా(Shashi kiran tikka) తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కథ, కథనం, ప్రెజెంటేషన్ ఇలా ప్రతీ విషయంలో టాప్ నాచ్ గా ఉంటుంది ఈ మూవీ. ఇక సినిమాలో అడవి శేష్ నటన అద్భుతం అనే చెప్పాలి. గూఢచారి సినిమా తరువాత థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయాడు అడవి శేష్. అంతేకాదు ఆయన సినిమాలకు సెపరేట్ మార్కెట్ కూడా ఏర్పడింది. 

ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన యూనిట్.. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. G2 టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో లావీష్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మిని సెలెక్ట్ చేశారు మేకర్స్. ఇదే విషయాన్నీ పీపుల్స్ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించారు. ఇమ్రాన్ హస్మి ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఓజీలో విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడే అదే క్రేజ్ ను G2 సినిమా కోసం వాడేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది.