బాలీవుడ్ లో ఇటీవల రిలీజై భారీ విజయాన్ని అందుకున్న సినిమా యానిమల్(Animal). టాలీవుడ్ వైలెంట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) తెరకెక్కించిన ఈ సినిమాలో రణ్బీర్ కపూర్(Ranbir kapoor), రష్మిక మందన్నా(Rashmika mandanna) జంటగా నటించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.260 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా లాంగ్ రన్ లో రూ.850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉంటే.. యానిమల్ సినిమాపై విమర్శలు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. సినిమాలో చూపించిన వైలెన్స్, బోల్డ్ డైలాగ్స్ పట్ల చాలా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినప్పటికీ యానిమల్ మూవీ వాటన్నింటినీ అధిగమించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే.. తాజాగా యానిమల్ సినిమాపై బాలీవుడ్ ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. యానిమల్ లో హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ ను బూట్లు నాకమని చెప్పడం, ఆడవాళ్ళని చెంపదెబ్బ కొట్టడం.. ఇలాంటి సన్నివేశాల వల్లే సినిమా హిట్ అయ్యింది. కానీ, అలాంటి వాటివల్ల సినిమా హిట్ అవడం ప్రమాదకరం. ప్రస్తుతం సినిమాలు తీస్తున్న మేకర్స్ కన్నా.. వాటిని చూస్తున్న ప్రేక్షకులకే ఎక్కువ బాధ్యత ఉండాలి. ఆ సినిమాల్లో చూపించే సన్నివేశాల వల్లే చూడాలా వద్దా అనేది ఆడియన్స్ డిసైడ్ అవ్వాలి.. అంటూ యానిమల్ లాంటి సినిమాలను ఎంకరేజ్ చేయకూడదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జావేద్ అక్తర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.