
హైదరాబాద్ సిటీ, వెలుగు: బోడుప్పల్లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం) బ్రాంచ్‌ను జోనల్మేనేజర్జీఎస్డీ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోడుప్పల్ బ్రాంచ్‌తో రాష్ట్రంలోని బీఓఎం బ్రాంచ్‌లు 74కు చేరాయన్నారు.
ప్రజలకు సురక్షిత బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 2400 బ్రాంచీల్లో 30 మిలియన్ల కస్టమర్లకు సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రాంచ్మేనేజర్అభిజిత్ చందుపట్ల, సిబ్బంది పాల్గొన్నారు.