
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) రిటైల్, హోమ్, కార్ల లోన్లపై వడ్డీని 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంక్ ఇస్తున్న హోమ్ లోన్లపై వడ్డీ రేటు 8.10 శాతానికి, కారు లోన్లపై వడ్డీ రేటు 8.45 శాతానికి దిగొచ్చాయి.
ఈ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేశామని బీఓఎం ప్రకటించింది. మరోవైపు గిఫ్ట్ సిటీలోని ఐఎఫ్‌ఎస్‌సీలో బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడానికి బ్యాంకుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది.