మాజీ సీఎం ఇంటిపై బాంబు దాడి.. ఒకరు మృతి

మాజీ సీఎం ఇంటిపై బాంబు దాడి.. ఒకరు మృతి

ఇంఫాల్: మణిపూర్ మాజీ సీఎం మైరెంబామ్ కొయిరెంగ్ ఇంటిపై శుక్రవారం మధ్యాహ్నం టెర్రరిస్టులు రాకెట్​బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వృద్ధుడు మరణించాడు. బాలిక సహా ఐదుగురు గాయపడ్డా రు. బిష్ణుపూర్ జిల్లా మోయిరాంగ్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా మణిపూర్లో టెర్రరిస్టుల రాకెట్​బాంబు దాడులు పెరిగిపోయాయి. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండో రాకెట్‌‌‌‌‌‌‌దాడి ఇది. ఈ దాడిలో వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడని అధికారులు తెలిపారు. ఐఎన్‌‌‌‌ఏ ప్రధాన కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. గాయపడిన వారిని అధికారులు దగ్గర్లోని అస్పత్రికి తరలించారు.