ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. ఉట్నూరు క్రాస్ రోడ్ దగ్గర నాలుగు నాటు బాంబులు పేలాయి. పేలుడులో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి శరీరభాగాలు చెల్లా చెదురయ్యాయి. మృతుడు మహారాష్ట్రలోని వర్నీకి చెందని వ్యక్తిగా గుర్తించారు.