పాకిస్తాన్​లో బాంబు పేలి 11 మంది మృతి

పాకిస్తాన్​లో బాంబు పేలి 11 మంది మృతి
  • మృతులంతా బొగ్గు గని కార్మికులు

ఇస్లామాబాద్: పాకిస్తాన్​లో బాంబు పేలి 11 మంది బొగ్గు గని కార్మికులు మృతిచెందారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌‌‌.. హర్నై జిల్లాలోని షహ్రాగ్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మినీ ట్రక్కులో 18 మంది కార్మికులను తీసుకెళ్తుండగా.. రోడ్డు పక్కన అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌‌‌‌ప్లోజివ్ డివైస్ పై నుంచి వెహికల్ వెళ్లడంతో పేలుడు సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్​కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని హర్నై డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వాలి కాకర్ తెలిపారు. గాయపడిన ఏడుగురు కార్మికులను ట్రీట్​మెంట్ కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.