భద్రాచలం, వెలుగు : చత్తీస్గడ్ లోని బీజాపూర్జిల్లా బాసగూడ పీఎస్ పరిధి పుత్కేల్అటవీ ప్రాంతంతో గురువారం ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైసెస్) బ్లాస్ట్ జరిగి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పుత్కేల్బేస్ క్యాంపు నుంచి కోబ్రా బలగాలు కూంబింగ్నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో జవాన్లు నడిచే క్రమంలో ప్రెషర్‌కు అది పేలింది. ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా వెంటనే బీజాపూర్జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి బాగానే ఉందని పోలీసులు చెప్పారు.
లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
చత్తీస్గడ్ లోని కొండగావ్జిల్లా పోలీసుల ఎదుట గురువారం మావోయిస్టు పార్టీ టెక్నికల్కమాండర్సన్నూ అలియాస్గింజరూ రామ్ఉసెండీ అలియాస్కమలదాస్ ఉసెండీ లొంగిపోయారు. ఆయనపై రూ.5లక్షల రివార్డు ఉంది. 1998--–2025 వరకు పార్టీ అప్పగించిన అనేక పనులను ఆయన నిర్వర్తించారు. పలు హింసాత్మక ఘటనల్లోనూ పాల్గొన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కొండగావ్పోలీసుల ఎదుట లొంగిపోయారు. తక్షణ సాయం కింద రూ.25వేలు అందజేశారు. అదేవిధంగా సుక్మా జిల్లా పాల్యా గ్రామానికి చెందిన కలుము పాయి లొంగిపోయారని ఎస్పీ బి. రోహిత్‌రాజు తెలిపారు.
2009 నుంచి ఆమె మావోయిస్ట్ పార్టీలో పని చేస్తుండగా.. ఎల్ఓఎస్కమాండర్గా, ఏరియా కమిటీ మెంబర్‌గా, మిలీషియా కమాండర్‌గా పని చేశారన్నారు. ఆమెపై రూ. 4లక్షల రివార్డు ఉందని.. పలు ఘటనల్లో పాల్గొన్నారని తెలిపారు. ఆమె ఆరోగ్యం సహకరించకపోవడం పాటు పోలీస్ బలగాల ఒత్తిడితో లొంగిపోయిందని చెప్పారు.