![ఆప్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు : 9 మంది మృతి](https://static.v6velugu.com/uploads/2022/04/Bomb-blasts-in-Afghanistan_wpMhFiyIbA.jpg)
కాబూల్ : ఆప్ఘనిస్తాన్ లో ఐఎస్‌ఐఎస్ (ISIS) తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర ఆఫ్గనిస్థాన్ లో గురువారం రాత్రి మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు. రెండు బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్ అధికారులు తెలిపారు. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్‌ఐఎస్ (ISIS) ప్రకటించింది.
మరిన్ని వార్తల కోసం..