కాబూల్ లో బాంబ్ బ్లాస్ట్..63 మంది మృతి

కాబూల్ లో బాంబ్ బ్లాస్ట్..63 మంది మృతి

ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఓ వివాహ వేడుకలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 63 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం  రాత్రి షియా ముస్లిం వర్గానికి చెందిన ఫంక్షన్ హాల్‌లో ఘనంగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 1000 కి పైగా మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ జరిగింది. దీంతో అక్కడిక్కడే 63 మంది మృతి చెందగా..మరో 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఎవరు ఈ దాడికి పాల్పడ్డారనేది ఇంకా ప్రకటించలేదు.