హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. పాఠశాలలో బాంబ్ పెట్టినట్లు గుర్తు తెలియని దుండగులు మొయిల్ చేయడంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాంబ్ స్వ్కాడ్ హుటాహుటిన డీపీఎస్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టింది.
విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన విషయంతో కావడంతో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా బాంబ్ స్వ్కాడ్ పోలీసులు పాఠశాలను అణవు అణువు జల్లెడ పట్టారు. దాదాపు రెండు మూడు గంటల విస్తృత తనిఖీల అనంతరం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముగిశాయి. పేలుడు పదార్థాలకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని పోలీసులు నిర్ధారించారు.
ALSO READ | మహారాష్ట్రలో కొత్త వ్యాధి .. జీబీఎస్‌తో ఒకరు మృతి
పాఠశాలలో ఎలాంటి పేలుడు పదార్ధాలు లభ్యం కాకపోవడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన స్కూల్ మేనేజ్మెంట్ ముందస్తుగానే విద్యార్థులకు సెలవు ఇచ్చి ఇంటికి పంపించింది. మరోవైపు డీపీఎస్‌కు బాంబు బెదిరింపు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూల్‌కు బాంబు బెదిరింపు కాల్ ఎవరి నుండి వచ్చింది..? మెయిల్ ఎవరు పంపారు..? అన్న దానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.