మహబూబాబాద్‌‌‌‌లో బాంబ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ తనిఖీలు

మహబూబాబాద్‌‌‌‌, వెలుగు : రిపబ్లిక్‌‌‌‌ డే వేడుకల సందర్భంగా మహబూబాబాద్‌‌‌‌ పట్టణంలోని బస్టాండ్‌‌‌‌, రైల్వే స్టేషన్‌‌‌‌, నెహ్రూ సెంటర్‌‌‌‌లో గురువారం బాంబ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలు చేపట్టినట్లు రిజర్వ్‌‌‌‌ ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీల్లో రామయ్య, నగేశ్‌‌‌‌, యాకయ్య, మురళి పాల్గొన్నారు.