
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ను బాంబ్ పెట్టి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. శనివారం (మార్చి2) రాత్రి పది గంటలకు 8889991916 నెంబర్ తో ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేసి సీఎంను బాంబు పోల్చి చంపేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి బెదిరించాడు. ఈ విషయం హెడ్ కానిస్టేబుల్ ఉధమ్ సింగ్ కాల్ లిఫ్ట్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి లొకేషన్, డిటేల్స్ అడగగానే కాల్ కట్ అయింది.
క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ నెంబర్ కాల్ చేసిన వ్యక్తి కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు నాలుగు టీంలు ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ పోలీసులు సాయంతో ఆ మొబైల్ నెంబర్ ట్రేస్ చేశారు. ఈ కాల్ కాకుండా ఈ మధ్యకాలంలో యోగి ఆదిత్యానాథ్ ను చంపేస్తామంటూ వార్నింగ్ కాల్స్, సోషల్ మీడియాలో బెందిరింపులు అనేకం వచ్చాయి. దీంతో ఆరాష్ట్ర పోలీస్ శాఖ వాటిపై ఫోకస్ పెట్టింది. ఆ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తోంది.