హైదరాబాద్: దేశంలో విమానాలకు బాంబ్ బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో దాదాపు 80 విమానాలకు బాంబ్ బెదిరింపు కాల్స్, మేసేజ్‌లు రాగా.. తాజాగా మరో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ కలకలం రేపింది. మంగళవారం (అక్టోబర్ 22) ఆకాశ్ ఎయిర్‌లైన్స్ విమానానికి గుర్తు తెలియని నెంబర్ నుండి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న విమానంలో బాంబు ఉందని దుండగుడు కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌కాల్ చేసి చెప్పడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
వెంటనే విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. రంగంలోకి దిగిన బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. విమానంలో బాంబ్, ఎలాంటి పేలుడు పదర్థాలు లేకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. బాంబ్ ఉందంటూ వచ్చిన ఫోన్‌ను ఫేక్ కాల్‌గా గుర్తించి.. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.